Andhrapradesh, జూలై 27 -- రాష్ట్రంలోని బీటెక్ సీట్ల భర్తీకి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా. తాజాగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి (జూలై 27) నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. . https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాల ప్రకారం. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు. జూలై 28వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 31వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆగస...