భారతదేశం, జనవరి 7 -- హైదరాబాద్: భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల విదేశీ విద్యా కలలకు రెక్కలు తొడిగేలా హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ (MU) ఒక కీలక అడుగు వేసింది. ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) తో చేతులు కలిపి ఒక వినూత్న విద్యా ఒప్పందాన్ని (Articulation Agreement) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సరికొత్త మార్గం సుగమమైంది.

ఈ ఒప్పందం ప్రకారం, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లను హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రెండేళ్ల చదువును ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని ANU క్యాంపస్‌లో కొనసాగిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆస్ట్రేలియాలోనే అగ్రశ్రేణి వర్సిటీగా పేరున్న ANU నుంచి అంతర్జాతీయ గుర్...