భారతదేశం, జూన్ 21 -- ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్‌ బ్యాటింగ్ తో తొలి టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియాతో లీడ్స్ లో జరుగుతున్న ఈ ఫస్ట్ టెస్టులో బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ దూసుకెళ్తోంది. తన స్టైల్లో దూకుడుగా ఆడుతోంది. బ‌జ్‌బాల్‌ బ్యాటింగ్ తో స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తోంది. శనివారం (జూన్ 21) తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 34 ఓవర్లు పూర్తయ్యే సరికి 138/2తో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకు ఆలౌటైంది.

వర్షం అంతరాయం కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కాస్త ఆలస్యమైంది. వరుణుడు వెళ్లిపోయి ఆట తిరిగి స్టార్ట్ కాగానే బుమ్రా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే క్రాలీ (4)ని ఔట్ చేశాడు. స్లిప్ లో కరుణ్ నాయర్ పట్టిన క్యాచ్ లో క్రాలీ పెవిలియన్ వెళ్లిపోయాడు. ఇలాంటి స్టార్ట్ దొరికిన తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోతారనిపించింద...