భారతదేశం, ఆగస్టు 2 -- ఇంగ్లాండ్‌తో ఓవల్ లో జరుగుతున్న అయిదో టెస్ట్ లో టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. బ్యాటింగ్ లో సత్తాచాటాడు. రెండో రోజు (ఆగస్టు 1) చివరి కొన్ని నిమిషాల్లో నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి పంపించిన అతను.. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడో రోజు (ఆగస్టు 2) ఉదయం సెషన్‌లో తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ కుడిచేతి బ్యాటర్ తన సహజ శైలిలో ఆడుతూ బంతులను బలంగా బాదాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆకాష్ దీప్ మూడో వికెట్‌కు నిలకడగా భాగస్వామ్యం నెలకొల్పాడు.

38వ ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆకాశ్ దీప్. మైలురాయిని చేరుకున్న వెంటనే ఆకాష్ దీప్ తన పిడికిలి బిగించి భారత జట్టు వైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాట్‌ను పైకెత్తాడు. భారత డ్రెస్సింగ్ రూమ్‌...