భారతదేశం, డిసెంబర్ 6 -- థియేటర్లో రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'పాంచ్ మినార్'. రాజ్ తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలైంది. అందుకే కేవలం 7 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మరో రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంది.

రాజ్ తరుణ్ లేటెస్ట్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ పాంచ్ మినార్. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజైంది. నవంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫస్ట్ కేవలం తెలుగులోనే ఈ మూవీ ఓటీటీ రిలీజైంది. ఇప్పుడు తెలుగుతో పాటు మరో రెండు భాషలు తమిళం, మలయాళంలోనూ ఈ మూవీని చూడొచ్చు. క్రైమ్ కామెడీ కోరుకునే ఆడియన్స్ కు పాంచ్ మినార్ మంచి ఆప్షన్.

నవంబర్ 21న థియేటర్లలో రిలీజైన పాంచ్ మినార్ వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ ...