భారతదేశం, జనవరి 3 -- స్మార్ట్​ఫోన్​ లవర్స్​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 15 5జీ, రెడ్‌మీ నోట్ 15 5జీ 108 మాస్టర్ పిక్సెల్ ఎడిషన్ వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్నాయి. షావోమీ ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్లు, కీలక ఫీచర్లను టీజ్ చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో పాటు రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

స్టాండర్డ్ రెడ్‌మీ నోట్ 15 5G మోడల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుండగా, ఇందులో 5,520ఎంఏహెచ్​ బ్యాటరీని అమర్చారు. ఇక 'మాస్టర్ పిక్సెల్ ఎడిషన్' ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో రాబోతోంది.

లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి:

రెడ్‌మీ నోట్ 15 5జీ సిరీస్ స్మా...