Andhrapradesh, సెప్టెంబర్ 7 -- గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలోని పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే వరుస మరణాలకు అసలు కారణాలేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

గ్రామంలో సెప్టెంబరు 2 నుంచి కొత్తగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని.. ప్రస్తుతం ఐదుగురు గ్రామస్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఏప్రిల్ నుంచి గ్రామంలో నమోదైన అనుమానాస్పద మరణాలకు కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

తురకపాలెంలో వరుస అనుమానాస్పద మరణాలు చోటుచేసుకోవడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యాధికారులను ఆదేశించారు.

సెప్టెంబర్ 2 నుంచి గత మూడు రోజులుగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం...