భారతదేశం, జనవరి 25 -- చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు.

అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. " నగరిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు...ఇది మన జీవన విధానం కావాలి. అందుకే ప్రతి నెలా 3వ శనివారం నాతో సహా నేతలు, అధికార యంత్రాంగం హాజరవుతున్నాము" అని త...