భారతదేశం, సెప్టెంబర్ 11 -- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేశారంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే వీటిపై అధికార వర్గాలు స్పందించాయి. పెండింగ్ లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఉన్నాయని క్లారిటీ ఇచ్చాయి. రిజర్వేషన్ల పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. గవర్నర్ వద్దనే పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టం చేశాయి.

ఇక ఈ బిల్లులకు ఆమోదముద్ర పడితే. త్వరలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల కానుంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.

ఇటీవలనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇందు...