భారతదేశం, అక్టోబర్ 12 -- తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా తన సొంత కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ధ్రువ్ విక్రమ్ హీరోగా స్పోర్ట్స్ థ్రిల్లర్ 'బైసన్' మూవీ రాబోతుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లో రిలీజ్ కాలేదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు రాబోతుంది? ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో ఓ సారి చూసేయండి.

ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది. అక్టోబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరోవైపు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బైసన్ మూవీ దీపావళి సందర్భంగా పండుగకు ముందుగానే అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్...