భారతదేశం, డిసెంబర్ 12 -- టీటీడీ ఆలయాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాద వితరణ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ఆధ్వర్యంలోని 60 ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏప్రిల్ 06, 1985 తేదీన టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలుత ఎస్వీ నిత్య ప్రసాద స్కీం క్రింద 2 వేల మందికి అన్నప్రసాదరణ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. ఆ తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది.

ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా ఏప్రిల్ 01, 2014న నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధున...