భారతదేశం, ఆగస్టు 6 -- గుండె బలహీనత (Heart Failure) అంటే చాలామంది గుండె ఆగిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గుండె బలహీనత అంటే, గుండె కండరాలు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవడం. ఈ పరిస్థితిలో, రక్తం వెనక్కి వెళ్లి ఊపిరితిత్తులు, కాళ్ళలో ద్రవాలు (ఫ్లూయిడ్స్) పేరుకుపోతాయి. ఆయాసం, అలసట, కాళ్లు వాపు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి దీనికి సాధారణ లక్షణాలు. అయితే, చాలామంది పట్టించుకోని మరికొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయని కార్డియాలజిస్ట్ డాక్టర్ యారనోవ్ హెచ్చరిస్తున్నారు. వీటిని ముందే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఆగస్టు 1న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన ఈ ఐదు ముఖ్యమైన లక్షణాలను వివరించారు.

గుండె బలహీనతకు సంబంధించిన చాలామంది గమనించని 5 లక్షణాలు ఇవే..

ఈ చిన్న చిన్న లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్ద...