భారతదేశం, జనవరి 14 -- ఈ సంక్రాంతి తమిళ సినిమా ఇండస్ట్రీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర పోటీ అనుకుంటే.. అది కాస్తా బయట ఫ్యాన్స్ వార్ కు దారి తీసింది. దళపతి విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటం, రిలీజైన పరాశక్తి మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం, ఇప్పుడు దళపతి విజయ్ అభిమానులనే లక్ష్యంగా చేసుకుంటూ సుధా కొంగర చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

సంక్రాంతికి తెలుగులో వరుస సినిమాలతో సందడి నెలకొంటే.. తమిళనాట వరుస వివాదాలు అక్కడి అభిమానులకు మింగుడు పడటం లేదు. అక్కడి సినిమాల రిలీజ్ కావడానికే తంటాలు పడుతుంటే.. ఇప్పుడు పరాశక్తి డైరెక్టర్ సుధ కొంగర.. వాటికి మరింత ఆజ్యం పోసే కామెంట్స్ చేసింది. తమ సినిమాపై కావాలని ఓ హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అనడం గమనార్హం.

ఆమె నేరుగా విజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఈ సంక్రాంతికి రి...