Hyderabad, ఆగస్టు 14 -- నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తన బాలీవుడ్ కెరీర్ గురించి తరచుగా మాట్లాడుతుంటారు. పరిశ్రమలో గుర్తింపు పొందడానికి ఒక ఔట్‌సైడర్ గా తాను ఎన్ని కష్టాలు పడ్డానో చాలాసార్లు వివరించారు. హౌటెర్‌ఫ్లైకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంగనా.. పరిశ్రమలోని చాలా మంది మేల్ యాక్టర్స్ ను 'మర్యాద తెలియని' (badtameez) వాళ్లు అని అన్నారు. కానీ తాను ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదని చెప్పారు.

ఇంటర్వ్యూ హోస్ట్ కంగనాను పరిశ్రమలోని హీరోల నుండి ఆమెకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగినప్పుడు ఆమె ఇలా అన్నారు. "నేను ఎక్కువ మంది హీరోలతో పని చేయలేదు. వాళ్లు అంత మర్యాదగా ఉండరన్నది నా ప్రధానమైన ఆందోళన" అని చెప్పింది.

"నేను లైంగిక వేధింపుల గురించి మాత్రమే చెప్పడం లేదు. సెట్‌కు ఆలస్యంగా రావడం, మర్యాదగా ప్రవర్తించకపోవడం, హీరోయిన్‌ను కించపరచడం,...