Hyderabad, సెప్టెంబర్ 4 -- సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. నిర్మాతగా దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సినిమా 'లోకా చాప్టర్ 1: చంద్ర'. వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.

డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ కల్యాణి ప్రియదర్శన్, ప్రేమలు హీరో నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదల చేశారు.

విడుదలైన మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా కొత్త లోక దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 3) సాయంత్రం హైదరాబాద్‌లో కొత్త లోక విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహ...