భారతదేశం, ఏప్రిల్ 21 -- టాలీవుడ్ ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇష్మార్ట్ శంకర్ అంటూ మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడీ యంగ్ హీరో లవ్ లో ఉన్నారంటూ ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అది కూడా ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని అంటున్నారు. ఒకే గది నుంచి ఈ ఇద్దరు తీసుకున్న ఫొటోలే అందుకు కారణమంటున్నారు.

ప్రస్తుతం రామ్ పోతినేని.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరీ చేస్తున్నారు. వరుసగా మాస్ సినిమాల చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఆ మూస నుంచి బయటకు వచ్చి ఢిఫరెంట్ స్టోరీ ట్రై చేస్తున్నారు. అయితే ఈ మూవీలో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు రామ్, భాగ్యశ్రీ రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో తమ అకౌంట్లల...