Hyderabad, అక్టోబర్ 3 -- తమిళ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. హారర్ మూవీ ఫ్రాంఛైజీ అయిన డీమాంటే కాలనీ ఫేమ్ అరుళ్‌నిధి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పేరు రాంబో (Rambo). ఈ సినిమా ట్రైలర్ శనివారం (అక్టోబర్ 4) రిలీజ్ కానుండగా.. వచ్చే వారం స్ట్రీమింగ్ కానుంది.

అరుళ్‌నిధి లీడ్ రోల్లో నటిస్తున్న రాంబో మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాను అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఇక శనివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు కూడా శుక్రవారం (అక్టోబర్ 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది.

"గ్లోవ్స్ వేసేసుకున్నాడు.. ఫైట్ జరగబోతోంది. అరుళ్‌నిధి రాంబో మూవీతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపించబోతున్నాడు. అక్టోబర్ 10న కేవలం సన్ నెక్ట్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది....