Hyderabad, జూన్ 13 -- ఆమిర్ ఖాన్ తాను తాజాగా నిర్మించిన మూవీ సితారే జమీన్ పర్ కేవలం థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, తర్వాత ఓటీటీలోకి రాదని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.125 కోట్ల ఆఫర్ ఇచ్చినా అతడు తిరస్కరించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని సినిమాలను నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ పై నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సితారే జమీన్ పర్ మూవీ థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుందన్న ఆమిర్ ఖాన్ ప్రకటన సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత తాజాగా నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'దంగల్', 'ఢిల్లీ బెల్లీ', 'పీప్లీ లైవ్', ...