భారతదేశం, జూన్ 25 -- సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ నుంచి గ్యాప్ దొరికితే వెకేషన్లు, మూవీలు చూడటంతో గడిపేస్తున్నారు మహేష్. తాజాగా ఓటీటీలో ఓ మూవీ చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. దీంతో ఆ మూవీని పొగిడేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటారా? అదే.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న 'అనగనగా'.

అనగనగా మూవీపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. కచ్చితంగా మీ సమయానికి తగిన అర్హత కలిగిందే అని ఎక్స్ లో బుధవారం పోస్టు చేశారు. ''సింపుల్, ఎమోషనల్ స్టోరీ అనగనగాను అద్భుతంగా చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా మీ సమయానికి తగ్గ అర్హత కలిగిందే. సుమంత్, మొత్తం టీమ్ గొప్ప పనితీరు కనబరిచారు. నా ప్రేమను పంపిస్తున్నా'' అని మహేష్ ట్వీట్ చేశారు.

విద్యా వ్యవస్థలోని లోపాలతో పాట...