Hyderabad, ఏప్రిల్ 28 -- నుస్రత్ బరూచా తెలుసా? ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చోరీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్లో ఎన్నోసార్లు బోల్డ్ సీన్లలో నటించింది. అయితే తొలిసారి బికినీ వేసుకునే సీన్ కోసం మాత్రం ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఆ ఇబ్బందిని అధిగమించడానికి నుస్రత్ తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగించకమానదు.

బాలీవుడ్ లో నుస్రత్ బరూచా 2006లో వచ్చిన జై సంతోషి మాతో అడుగుపెట్టింది. అయితే 2011లో వచ్చిన ప్యార్ కా పంచనామా మూవీతో పాపులర్ అయింది. ఆ సినిమా హిట్ అయింది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ మూవీలోనే నుస్రత్ బికినీ సీన్ చేయాల్సి వచ్చింది. అదే ఆమెకు తొలిసారి. దీంతో ఆ భయాన్ని అధిగమించడానికి ఆమె అంతకుముందు మూడు రోజుల పాటు బికినీలోనే గడిపిందట.

ఆ సీన్ చేయడానికి ముందు ఆమె ఒంటరిగా ఓ ట్రిప్ కు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు కేవలం ...