భారతదేశం, నవంబర్ 4 -- బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ను ఎప్పుడైనా పాన్ నములుతూ చూశారా? మీరే కాదు ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ ఒకానొక సమయంలో అతడు ఏకంగా రోజుకు వంద పాన్లు నమిలేవాడట. అయితే అది అంత వ్యసనంలా మారిపోయిందా అని అనుకోకండి. ఓ సినిమాలో తాను పోషించిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఆమిర్ ఈ పని చేశాడట. ఇది 2014లో విడుదలైన 'పీకే' సినిమా షూటింగ్‌లో కావడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

'పీకే' సినిమాలో ఆమిర్ ఖాన్ గ్రహాంతరవాసి (ఏలియన్) పాత్ర పోషించాడు. ఒక లక్ష్యంతో భూమి పైకి వచ్చిన అతడు.. అనుకోకుండా ఇక్కడే చిక్కుకుపోతాడు. తన అసాధారణ శక్తులతో భూమిపై మనుషుల భాష, వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటాడు.

ఈ క్రమంలో సినిమాలో అతని పాత్ర నిరంతరం పాన్ నములుతూ కనిపిస్త...