భారతదేశం, ఫిబ్రవరి 18 -- 'బాహుబలి' తర్వాత రానా దగ్గుబాటి ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్యల గురించి మరోసారి నోరు విప్పాడు. కిడ్నీ మార్పిడి, ఆ తర్వాత జరిగిన శారీరక మార్పుల వల్ల తాను ఒప్పుకున్న సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశానని తెలిపాడు. రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ గురించి, తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి 'బాహుబలి 2' తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కిడ్నీ వైఫల్యం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ అతడు అమెరికాలో చికిత్స పొందాడు. అక్కడ కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. తాజాగా రియా చక్రవర్తి హోస్ట్ చేస్తున్న 'చాప్టర్ 2' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రానా.. ఆ కష్ట సమయాలను గుర్తుచేసుకున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ లో రానాకు 'హ్యాండ్సమ్ హంక్' అనే ఇమేజ్ ఉండేది. కానీ...