Hyderabad, మే 8 -- పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాదుల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఈ అడ్వైజరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2021 ప్రకారం జారీ చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ కు ఇవి వర్తిస్తాయి. దీని ప్రకారం కొన్ని రకాల కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రీమింగ్ చేయకూడదు. అవేంటంటే..

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, ఉద్రిక్తతల నేపథ్యంలో జాతి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కీలక ని...