భారతదేశం, మే 5 -- అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్‍లతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలపై భారీగా టారిఫ్‍లను విధిస్తామని ప్రకటించారు. అమెరికాకు ఎగుమతి చేస్తున్న దేశాలపై సుంకాలు వేయనున్నట్టు వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొంది. అయితే, చైనా మినహా అన్ని దేశాలకు టారిఫ్‍లను 90 రోజులు ఆపారు. తాజాగా ఇప్పుడు సినమా రంగంపై ట్రంప్ పడ్డారు. భారీ సుంకాన్ని విధించేందుకు ఆదేశాలు ఇచ్చారు.

వేరే దేశాల్లో నిర్మితమై అమెరికాలో విడుదలయ్యే సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ నేడు (మే 5) ప్రకటించారు. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ వేగంగా చతికిల పడుతోందని, అందుకే తమ దేశంలో సినిమాలను ప్రొడ్యూజ్ చేయడాన్ని పెంచేందుకు ఇలా సుంకాలను విధిస్తున్నాన...