భారతదేశం, జూన్ 29 -- మంచు విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. శుక్రవారం (జూన్ 27) ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ముకేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లో ఇండియాలో రూ.15.29 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. సక్నిల్క్ ప్రకారం కన్నప్ప భారతదేశంలో మొదటి రోజు రూ .9.35 కోట్ల నెట్, రూ .11 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఓవర్సీస్ లో రూ.2 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ.13 కోట్లు రాబట్టింది....