భారతదేశం, జూన్ 18 -- బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన 'సితారే జమీన్ పర్' సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ స్పోర్డ్స్ కామెడీ డ్రామా చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ మూవీని హీరో ఆమిర్ ఖాన్‍తో పాటు అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి వచ్చిన ఓ భారీ ఓటీటీ డీల్‍ను ఆమిర్ వద్దనుకున్నారన్న రూమర్లు బయటికి వచ్చాయి.

సితారే జమీన్ పర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఏకంగా రూ.120కోట్ల డీల్‍ను ఆఫర్ చేసిందని సమాచారం బయటికి వచ్చింది. కానీ ఆమిర్ ఖాన్ ఆ ఆఫర్ తిరస్కరించారని, ఎక్కువ రోజులు థియేటర్లలో సినిమాను నడిపేందుకు ఓటీటీ డీల్ వద్దనుకున్నారని టాక్.

ఓటీటీలోకి సితారే జమీన్ పర్ సినిమాను త్వరగా తీసుకురాకు...