భారతదేశం, జనవరి 14 -- తెలుగు క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇవాళ ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు రోజుల ముందు జరిగిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవీన్ పోలిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "జాతిరత్నాలు ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

"'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మీరు మౌత్ టాక్‌తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చే...