భారతదేశం, నవంబర్ 25 -- అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశంలో సంచలన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ దివంగత సింగర్ జుబిన్ గార్గ్‌ మృతి కేసుపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానాన్ని తాము వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గార్గ్‌ది సహజం మరణం కాదు.. హత్యే అని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ రెండు నెలల కిందట మరణించిన విషయం తెలుసు కదా. దీనిపై అస్సాం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వివరాలు వెల్లడించారు. "జుబిన్ గార్గ్ సెప్టెంబర్ 19, 2025న మరణించారు. మరుసటి రోజు సెప్టెంబర్ 20న, మేము మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. జుబిన్ గార్గ్‌ది సహజ మరణం కాదని మొదటి రోజు నుంచే అనుమానించాం...