భారతదేశం, జూలై 15 -- బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి మాత్రమే కాదు ఏకంగా ఇండియన్ మూవీ రేంజ్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు ప్రోడ్యూసర్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అలవోకగా రూ.1000 కోట్ల వరకూ పెడుతున్నారు. కానీ ఈ ఎపిక్ సినిమా కోసం ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం మతి పోగొట్టేదే. ఆ మూవీ.. 'రామాయణ'. ఎపిక్ కథను సినిమాగా తీసుకురావడం కోసం రామాయణ మూవీ రెండు పార్టులపై ప్రొడ్యూసర్లు పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.4 వేల కోట్లు.

రామాయణ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. ఇది అబద్దం కాదు.. పచ్చి నిజం. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాయణ సినిమా బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

''పార్ట్ 1, 2 కలిపి మేం కంప్లీట్ చేసే సమయానికి బడ...