Hyderabad, మే 17 -- హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ శుభం. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సమంతతోపాటు మూవీ టీమ్ అభిమానులను, ఆడియెన్స్‌ను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం (మే 16) శుభం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేసింది.

నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. "పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. 'శుభం' మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరి దగ్గర నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు" అని చెప్పింది.

"నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకు ...