భారతదేశం, నవంబర్ 27 -- బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'రంగీలా' మూవీ థియేటర్లలో రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పందించాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో పనిచేసిన అనుభవాలను పంచకుంటూ.. కొన్ని ట్రాక్‌లను అందించడానికి రెహమాన్ చాలా సమయం తీసుకున్నారని, ఈ ఆలస్యం తనను ఎంతగానో విసిగించిందని, ఒకానొక దశలో ఆయనను కొట్టాలని కూడా అనిపించిందని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' చిత్ర సంగీతంపై, ముఖ్యంగా 'హాయ్ రామా' పాటపై ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ ప్రయాణం అంత సులభం కాదని ఆయన ఒప్పుకున్నాడు.

"మేము 'హాయ్ రామా' పాట కంపోజిషన్ కోసం గోవాకు వెళ్లాం. అక్కడ ఐదు రోజులు ఉన్నాం. మొదటి రోజు రెహమాన్ 'రామూ, నే...