Tirumala,andhrapradesh, మే 12 -- తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల మిగిలిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని స్పష్టం చేసింది.

వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించింది. ఈ టికెట్లను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులు బుకింగ్ చేసేసుకుంటున్నారని వివరించింది. ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సంద‌ర్భం లేదని టీటీడీ పేర్కొంది.

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో మాత్రమే తగ్గాయని వివరించింది. కానీ కొంద‌రు వ్య‌క్తులు సోష...