భారతదేశం, డిసెంబర్ 26 -- మనం వాడే పెయిన్ కిల్లర్స్ మనకు మేలు చేస్తున్నాయా? లేక తెలియకుండానే మన ప్రాణాల మీదకు తెస్తున్నాయా? సాధారణంగా దెబ్బలు తగిలినప్పుడు లేదా సర్జరీల తర్వాత నొప్పి తగ్గడానికి వైద్యులు 'ట్రామడాల్' (Tramadol) అనే మందును సూచిస్తుంటారు. అయితే, ఈ మందు అంత ప్రభావవంతమైనది కాదని, పైగా దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి సంచలన విషయాలను బయటపెట్టింది.

2025 అక్టోబర్‌లో 'బి.ఎమ్.జె ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్' (BMJ Evidence-Based Medicine) ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. దీర్ఘకాలిక నొప్పుల నివారణలో ట్రామడాల్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. పరిశోధకులు సుమారు 6,500 మందిపై చేసిన 19 రకాల క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించగా, ఈ మందు వల్ల కలిగే మేలు తక్కువ, కీడు ఎక్కువ అని తేలింది.

ఈ అధ్యయనంలో తేలిన అత్యంత ఆందోళనకర...