భారతదేశం, జూన్ 7 -- సింగర్, రాపర్ బాద్షా మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ అతను కొత్త సాంగ్ గురించి ఏం కాదు. బాద్షా వివాదాస్పద కామెంట్ చేశాడు. గ్లోబల్ పాప్ స్టార్ దువా లిపా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. పాట కాదు కానీ పిల్లలను కంటా అని అతను పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ ఫైర్ అవుతున్నారు.

బాద్షా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో "దువా లిపా ❤️" అని రాసి, శుక్రవారం (జూన్ 6) పోస్టు చేశాడు. దీనికి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ''భాయ్.. మీరు ఆమెతో కలిసి ఓ ట్రాక్ (సాంగ్) చేస్తున్నారా?'' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాద్షా చేసిన కామెంట్ ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. దీనికి బాద్షా బదులిస్తూ.. "నేను ఆమెతో పిల్లల్ని కనడానికి ఇష్టపడతాను బ్రో" అని కామెంట్ చేశాడు. దీనిపై...