Hyderabad, జూన్ 15 -- టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు భారీ స్టార్స్‌తో తెరకెక్కిన సినిమా కుబేర. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించింది. దీంతో కుబేరపై భారీ అంచనాను నెలకొన్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమాను జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కుబేర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నాగార్జున పాత్ర, కుబేర సినీ విశేషాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

-శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్‌కి చాలా న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది.

-చాలా డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల...