భారతదేశం, నవంబర్ 20 -- క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి-మోడల్ మహీకా శర్మ తమ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లకు తావిచ్చారు. ఇటీవల హార్దిక్ పంచుకున్న ఫోటోలలో మహీకా వేలికి ఉన్న ఉంగరం ఈ పుకార్లకు ప్రధాన కారణమైంది. అంతేకాదు వాళ్లు ఫొటోలకు పోజులిచ్చిన తీరు కూడా అదే కన్ఫమ్ చేస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి-మోడల్ మహీకా శర్మ సోషల్ మీడియాలో నిరంతరం తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే బుధవారం (నవంబర్ 19) నాడు హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో వారిద్దరూ కలిసి చేసిన పూజ కూడా ఉంది. అయితే ఈ ఫోటోలలో మహీకా వేలికి ఉన్న మెరిసే ఉంగరం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. దీంతో వారిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారా అని అభిమానులు ప్రశ్న...