భారతదేశం, డిసెంబర్ 18 -- పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వం చేయలేదన్న ఆయన. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని తెలిపారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2029లోనూ ఇదే మాదిరి ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుం...