భారతదేశం, మే 1 -- వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు హీరో శ్రీ విష్ణు. 'సింగిల్' మూవీతో ఫ్యాన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ కామెడీ గా వస్తున్న ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. అయితే రిలీజ్ కు ముందు ఈ మూవీ విడుదల చేసిన ట్రైలర్ కాంట్రవర్సీకి కారణమైంది. హీరో శ్రీ విష్ణు తాజాగా సారీ చెప్పారు.

ఏప్రిల్ 28న సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరో, రొమాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని మూవీస్, మీమ్స్ రిఫరెన్స్ తీసుకున్నారు. ఇందులో భాగంగానే 'శివయ్యా' అనే డైలాగ్ ను వాడుకున్నారు.

'కన్నప్ప' మూవీలో హీరో మంచు విష్ణు 'శివయ్యా' అనే డైలాగ్ చెప్పారు. విష్ణు చెప్పిన ఈ డైలాగ్ పై విపరీతమైన ట్రో...