భారతదేశం, జనవరి 12 -- టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేశారు. భీమ్స్ సెసిరోలె సంగీతం అందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథులుగా డైరెక్టర్స్ హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ, పవన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్‌లో నా స...