Hyderabad, సెప్టెంబర్ 29 -- బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హౌజ్‌లో ఆడిన తీరు, ఉన్న విధానంపై ప్రశ్నలు అడుగుతుంటారని తెలిసిందే. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బజ్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా హీరో, మాజీ సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఉన్నాడు.

హౌజ్‌లోనే సూటిగా మాట్లాడిన శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఆటతీరుపై గట్టిగానే అడుగుతున్నాడు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా శెట్టి బజ్ ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమె హౌజ్‌లో ఉన్న తీరును శివాజీ ఎండగట్టడంతో ప్రియకు చెమటలు పట్టాయి.

ప్రియా రాగానే ముందుకు చాపి కాలు మీద కాలు వేసుకుని శివాజీ కూర్చున్నాడు. "ఇలా కూర్చుంటే ఎలా ఉంది. బాలేదుగా. ఓసారి ఫొటో వేయండమ్మా" అని శివాజీ అన్నాడు...