భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా నష్టం సంభవించింది. దీనిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం ప్రకటించారు. 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 257 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయని, భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదించారు.

వర్షాలు, నష్టాలపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 82 మండలాల్లో సుమారు 2.36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి వ్యవసాయ శాఖ నష్టాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అదేవిధంగా 257 చెరువులు, కుంటలకు ...