భారతదేశం, ఫిబ్రవరి 18 -- హైదరాబాద్‌లో దారుణమైన ఘటన జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. నిందితుడు మహేష్ రెండు కత్తులు, పెట్రోల్ డబ్బా తీసుకుని సునీత ఇంట్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఆమెపై కత్తులతో దాడి చేసి, తరువాత పూల కుండితో తలపై పగులగొట్టి చంపేశాడు. దీంతో సునీత అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సునీత కొన్ని రోజుల క్రితం మహేష్‌కు వడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకుంది. పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....