Hyderabad, అక్టోబర్ 4 -- బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మిత్ర మండలి'.

ఈ మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించారు. వీరితోపాటు వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, 'కట్టండుకో జానకి', 'స్వేచా స్టాండు', 'జంబర్ గింబర్ లాలా' వంటి పాటలతో 'మిత్ర మండలి'పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 16న థియేటర్లలో మిత్ర మండలి రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మిత్ర మండలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌‌లో సందడి చేసింది. దసరా సందర్భంగా ని...