భారతదేశం, డిసెంబర్ 16 -- మోస్ట్ అవైటెడ్ తమిళ సినిమాల్లో పరాశక్తి ఒకటి. ఇందులో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీలీలకు ఇదే ఫస్ట్ తమిళ చిత్రం. ఈ మూవీతోనే ఆమె కోలీవుడ్ లో అడుగుపెడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్ నర్ కన్ఫామ్ అయినట్లు తెలిసింది.

శ్రీలీల తమిళ అరంగేట్ర చిత్రం పరాశక్తి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో తెలిపోయింది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ భారీ ధరకు కొనుగోలో చేసిందని టాక్. ఇందుకోసం మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. థియేట్రికల్ రన్ తర్వాత పరాశక్తి మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.

పరాశక్తి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 14న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇ...