Hyderabad, జూలై 3 -- హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీలో నితిన్‌కు అక్కగా కీలక పాత్ర పోషించింది. అలాగే, తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేశారు. మలయాళ బ్యూటి స్వాసిక మరో కీలక పాత్రలో అలరించేందుకు డెబ్యూ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో సహా పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు.

-తమ్ముడు మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్‌గా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ ...