Hyderabad, సెప్టెంబర్ 27 -- సినిమా ఫలితం ఎలా ఉన్న సంగీతంతో అలరిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాజాగా తమన్ తన బీజీఎమ్‌తో మెస్మరైజ్ చేసిన సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. "విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పని చేస్తాం" అని అన్నారు.

"ఓజీ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్ నా ...