భారతదేశం, నవంబర్ 14 -- ఇవాళ ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ 'అవిహితం' వచ్చేసింది. వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా ఉండే కథతో తీసుకొచ్చిన సాహసోపేత సినిమా ఇది. అక్రమ సంబంధాలు, వాటి వెనుక ఉన్న కారణాలు, ఓ రహస్య స్త్రీని పట్టుకునేందుకు గ్రామస్తుల ప్రయత్నాలు.. ఇలా అవిహితం మూవీ సాగుతోంది.

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగిన కథలాగే ఉంటాయి. ఇప్పుడు అదే కోవలో వచ్చిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమానే అవిహితం. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 14) ఓటీటీలో రిలీజైంది. జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయాక భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ అయితే మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ గా మారిపోతున్నా...