భారతదేశం, జూన్ 29 -- ఓటీటీలో ఢిఫరెంట్ జోనర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో థ్రిల్లర్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, కను రెప్ప వేయనివ్వని మూవీస్ కూడా ఉన్నాయి. ఆహా ఓటీటీలో ఉన్న అలాంటి టాప్-5 థ్రిల్లర్లు ఇవే. అవేంటో ఇక్కడ చూసేయండి.

మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్నతో వచ్చిన మూవీ '23 ఇరవై మూడు'. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చింది. కులం ఆధారంగా శిక్షలు విధిస్తారనే విషయాన్ని చాటుతూ.. న్యాయం కోసం బలహీన వర్గాలు సాగించే పోరాటం నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఈ మూవీ అదిరిపోయిందని, కథ ఆలోచించేలా ఉందని ఎక్స్ లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

నవీన్ చంద్ర హీరోగా వచ్చిన 'లెవన్' మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తోంది. కవలలను ...