Hyderabad, మార్చి 27 -- తినే ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఉప్పు అధికంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే అదే వైద్యులు ఉప్పును పూర్తిగా తీసుకోకపోయినా కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉప్పు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎంత తీసుకోవాలో వివరిస్తున్నారు.

ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. సోడియం మన శరీరంలో కీలక పాత్ర పోషించే ఒక ఎలక్ట్రోలైట్. కాబట్టి సోడియం మనకు ఖచ్చితంగా కావాల్సిన పోషకమే. దాన్ని పూర్తిగా తగ్గిస్తే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.

ఎప్పుడైతే మీరు ఉప్పుని తీసుకోవడం చాలా వరకు తగ్గించేస్తారో అప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. రక్త కణాలలో, చుట్టుపక్కల ద్రవ సమతుల్యతను నియంత్రించడానికి సోడియం ఎంతో సహాయపడుతుంద...