భారతదేశం, ఆగస్టు 5 -- చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. బంగారాన్ని తాకట్టు పెట్టి, వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. అయితే ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి కూడా రుణాలు పొందవచ్చు. ఇటీవలి కాలంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు గతంలో కంటే వేగంగా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. అధిక రిస్క్ ఉన్నందున వ్యక్తిగత రుణాలకు అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. వీటిని అసురక్షిత రుణాలు అంటారు. ప్రత్యామ్నాయంగా యజమానులు తమ ఆస్తిని బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోవచ్చు.

ఆస్తి తనఖాలతో రుణాలు పొందడం అంత సులభం కాదు. ఇక్కడ బ్యాంకులు ఆస్తి, దరఖాస్తుదారునికి సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. దీని గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

బ్యాంకు మీ ఆస్తి...